- 17 సంవత్సరాలుగా ప్రజా సేవ
నమస్తే శేరిలింగంపల్లి : పదిహేడు సంవత్సరాలుగా ప్రజలకు సేవ… ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారమే ద్యేయంగా పనిచేసిన వ్యక్తి ఉరిటి వెంకట్రావు. నేడు ప్రజాపాలనకు ఆకర్షితులై కాంగ్రెస్ తీర్థం పుచ్చకున్నారు. శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్, చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి, ఎంబీసీ చైర్మన్ జెరిపేటి జైపాల్, సీనియర్ నాయకుడు రఘునాథ్ యాదవ్ ల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఉరిటి వెంకట్రావు 2007 సంవత్సరం నుంచి చందానగర్ రాజకీయాలలో క్రియశీలకముగా పనిచేస్తున్నారు. 2016 సంవత్సరములో టీడీపీ పార్టీ నుంచి చందానగర్ కార్పొరేటర్ గా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2019 సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీలో చేరి స్థానిక ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅనుచరులలో ఒకరిగా వున్నారు. ఇలా గత 17 సంవత్సరాలుగా డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే క్రమంలో క్రియశీలక పాత్ర పోషిస్తూనే వున్నారు.
ఆయనతో పాటు పార్టీలో చేరిన వారిలో సుధాకర్ , పూర్ణచందర్ రావు, వెంకటేష్, నరేష్, మురళి, ప్రతాప్, సంపంగి రాజకుమార్, కాశి, బిమేష్, శ్రీనివాస్, గిరి, నాగబాబు, వినయ్, మహేష్, చందు, రాఘవ, శ్రీకాంత్, మణి, లోకేష్, గోపి, భూషణం, సుబ్బారావు, క్రాంతి, పవన్, నాగరాజు, పోసిన భాస్కర్, రాజు, బీమమ్మా, కిరణ్, చందన్ సాయి, కుమార్, ఎం శ్రీనివాస్, ఉన్నారు.