- ఆనందోత్సహాల నడుమ డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులతో ఆత్మీయ సమావేశం
నమస్తే శేరిలింగంపల్లి : పేదల సొంతింటి కలను సాకారం చేసిన గొప్ప నాయకుడు, మనసున్న మహారాజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధి నల్లగండ్ల గుల్ మోహర్ కాలనీలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయంలో లబ్ధిదారుల విజ్ఞప్తి మేరకు పర్యటించి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పొందిన లబ్దిదారులు మాట్లాడుతూ ఇది తమ ఇంట్లో నిజమైన పండుగ రోజని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల పక్షపాతి అని, పేదలకు దైవం తో సమానమని, ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చి స్వంత ఇంటి కల నెరవేర్చిన గొప్ప మనసున్న నేత కేసీఆర్ అని అన్నారు. వారికి తాము జీవితాంతం రుణాపడి ఉంటామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గాంధీని ఎప్పటికి మర్చిపోలేమని జీవితాంతం గుండెలో దాచుకుంటామని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే గాంధీని ఘనంగా సన్మానించుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ఒక్క పైసా ఖర్చు లేకుండా పేదవాడికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందించిన ఘనత తెలంగాణ కేసీఆర్ కే దక్కుతుందన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ను కట్టించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని, ఆ ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, గుల్ మోహర్ కాలనీ ప్రెసిడెంట్ ఖాసీం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఖాసీం, లియాఖత్ పాల్గొన్నారు.