- కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ పని చేయాలి: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్
- గచ్చిబౌలి లో బిజెపికి అత్యధిక మెజారిటీ వచ్చే దిశగా కృషి చేయాలి: కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి: భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ప్రవాస్ యోజనలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధి గౌలిదొడ్డి లోని ఎస్.ఆర్. కన్వెన్షన్ హాల్ లో గచ్చిబౌలి డివిజన్ శక్తి కేంద్రాల ఇన్చార్జిలు, బూత్ అధ్యక్షులు సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కర్ణాటక మాజీ మంత్రి, ఎమ్మెల్యే మునిరత్న నాయుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్, శేరిలింగంపల్లి నియోజకవర్గ కన్వీనర్ రాఘవేంద్ర రావు తో కలిసి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్ణాటక మాజీ మంత్రి, ఎమ్మెల్యే మునిరత్న నాయుడు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలు సాధిస్తామని చెప్పి కేసీఆర్ అధికారంలోకి వచ్చారని, నేడు వాటిని తుంగలో తొక్కారని ఆరోపించారు.
దళిత బంధు పూర్తి స్థాయిలో అమలు లేదని, గిరిజన బంధు లేదని, మూడెకరాలు లేదన్నారు. గిరిజనులు ఆడపిల్లలు అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజల కలలు కల్లలు చేశారని, అబద్ధాలతో కాలయాపన చేస్తున్నారన్నారు. కుటుంబ, అవినీతి కెసిఆర్ పాలన అంతమొందించేందుకు, అధికారమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. అనంతరం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ గచ్చిబౌలి డివిజన్ పరిధి లోనీ ప్రతి పోలింగ్ బూత్, కమిటీ, శక్తి కేంద్రాలను మరింత పటిష్టం చేయాలన్నారు. కెసిఆర్ పాలన తో విసిగిపోయారని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు.
అందుకే రాష్ట్రంలో బిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిన బిజెపి వైపు ప్రజలంతా చూస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, బూత్ ఇంచార్జిలు, బూత్ కమిటీ అధ్యక్షులు, శక్తి కేంద్రల ఇంచార్జిలు, డివిజన్ నాయకులు, బీజేవైఎం నాయకులు, యువ మోర్చా నాయకులు, మహిళా మోర్చా నాయకులు, కిసాన్ మోర్చా నాయకులు, ఎస్సీ మోర్చా నాయకులు, ఎస్టి మోర్చా నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.