నమస్తే శేరిలింగంపల్లి: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ సభ్యురాలిగా నియమితులైన గడ్డం సీత రంజిత్ రెడ్డితో పాటు చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డిని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గంధం రాములు మర్యాదపూర్వకంగా కలిశారు.
అనంతరం వారిని గజమాలతో సన్మానించి హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో TPUS నాయకులు భాస్కర్, సంపత్, మోహన్ నాయక్,జనార్ధన్, చంద్రమౌళి బహుజన టీచర్స్ యూనియన్ అధ్యక్షులు చెన్నయ్య పాల్గొన్నారు.