- కెనరీ ద స్కూల్ లో వేడుకగా వినాయక చవితి సందర్భంగా ఉత్సవాలు
- స్వహస్తాలతో మట్టివినాయకులు తయారు చేసిన విద్యార్థులు
నమస్తే శేరిలింగంపల్లి : మదీన గూడలోని కెనరీ ద స్కూల్ లో వినాయక చవితి సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమ ఉత్సవాల సంబురం అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు, నాటికలు అబ్బురపరిచాయి.
గణేశుడి జీవితం, పురాణాలను వర్ణించే శక్తివంతమైన నాటిక వేసి తమ ప్రతిభతో ఆకట్టుకున్నారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ స్ఫూర్తితో మట్టి గణేశ విగ్రహాలను తయారు చేసి వినాయకుడి పట్ల ఉన్న భక్తి భావాన్ని చాటి చెప్పారు. తమ స్వహస్తాలతో , సృజనాత్మకతతో వినాయక విగ్రహాలను చేయడం ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ లిడియా క్రిస్టినా పాల్గొని విద్యార్థులకు సంప్రదాయాల పట్ల అవగాహన కల్పించారు, పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యత గురించి వివరించారు.