నమస్తే శేరిలింగంపల్లి : మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్యనగర్ కాలనీవాసులు పలు సమస్యలు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. కాలనీలో నెలకొన్న మంచినీటి సమస్యను పరిష్కరించాలని, అసంపూర్తిగా మిగిలిపోయిన సీసీ రోడ్లను వేయాలని, కరెంట్ అంతరాయం పై చర్యలు తీసుకోవాలని, ట్రాన్స్ఫార్మర్స్, వీధి దీపాలను ఏర్పాటు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. దీనిపై ఎమ్మెల్యే గాంధీ సానుకూలంగా స్పందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ కాలనీలో నెలకొన్న మంచినీటి సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని, ఎక్కువ ప్రెజర్ తో నీటి విడుదల చేస్తామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి నీరు వదలడం జరుగుతుందని, అదిత్యనగర్ లో అన్ని రకాల మౌలిక వసతులు కలిపించామని, అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లను అతి త్వరలో చేపట్టి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని వారికి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ఆదిత్య నగర్ వాసులు ఖాసీం, లియాఖత్ అలీ, ఇమ్రాన్, మహమ్మద్ అమీర్, సర్ఫార్జ్ మోహిన్ద్దీన్, మొయిజ్, గౌస్, ఫజల్, అస్లాం, జావేద్, సయ్యద్, ఏడుకొండలు, శ్రీనివాస్ రావు, దస్తగిరి, విశ్వనాథ్, తులసి ప్రసాద్, మహిళలు స్నేహ, పర్వీన్ కాలనీ వాసులు పాల్గొన్నారు.