- ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి శుభాకాంక్షలు తెలిపిన కొండాపూర్ డివిజన్ పత్రిక నగర్ కాలనీల వాసులు
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన శుభసందర్బంగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి స్వచ్ఛందంగా శుభాకాంక్షలు తెలిపేందుకు ముందుకొస్తున్నారు ప్రజలు పాలు కాలనీల వాసులు. ఇందులో భాగంగా వివేకానంద నగర్ లోని ఎమ్మెల్యే గాంధీ నివాసంలో ఆయనను కొండాపూర్ డివిజన్ పరిధిలోని పత్రిక నగర్ కాలనీల వాసులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరిస్తూ అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరింత బాధ్యతగా కాలనీల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.