నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధి పాపిరెడ్డి కాలనీ లోని ఆరంభ టౌన్షిప్ లో జరిగిన కార్తీక మాస వన భోజనాల కార్యక్రమం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ఎమ్మెల్యే గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కాలనీ వాసులందరికి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మల్లేష్ గౌడ్, వేణు గోపాల్ రెడ్డి , రమేష్, ఆరంభ టౌన్షిప్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీంద్ర రాథోడ్, రాజేష్, సరిత, అరుణ శ్రీ, స్వాతి, విశాలాక్షి , మానసారెడ్డి, మౌలిక, నాగరాజ , జనార్ధన్ , బసవయ్య , లోకనాథ్ రెడ్డి, దాసరి గణేష్, వెంకటేశ్వర్లు గుప్తా, సాయిరాం, మహేష్ పాల్గొన్నారు.