నమస్తే శేరిలింగంపల్లి : మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారము మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తుందని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్, కార్పొరేటర్ పూజిత గౌడ్ తెలిపారు. చందానగర్ డివిజన్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని వారు ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ.. 6 గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందని, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, చేయూత పథకంలో భాగంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సాయం రూ.10లక్షలు అందించడం జరుగుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో చందానగర్ డివిజన్ పరిధిలోని చందానగర్ బస్ స్టాప్ వద్ద శేరిలింగంపల్లి నియోజకవర్గ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులతో కలిసి మిఠాయిలు పంచి మహిళలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వారు వివరించారు. అనంతరం హఫీజ్ పెట్ డివిజన్ కార్పొరేటర్ వి.పూజిత గౌడ్ చందానగర్ బస్ స్టాప్ నుండి మియాపూర్ వరకు మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రఘునందన్ రెడ్డి, నల్ల సంజీవ రెడ్డి, విరేందర్ గౌడ్, గాఫుర్, యాదయ్య గౌడ్, ఖాన్, చందనగర్ డివిజన్ అధ్యక్షులు అలీ, లింగంపల్లి డివిజన్ అధ్యక్షులు జంగర్, వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు యాదగిరి, నాయకులు ఏకాంత్ గౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు రాజన్, కార్యకర్తలు, రవి కుమార్, సురేష్, ప్రవీణ్, రాంబాబు, హరీష్ గౌడ్, విజయ్ ముదిరాజ్, నరేందర్, అసిఫ్, శ్రీనివాస్ ముదిరాజ్, రామచందర్, గిరి, సాయి, శ్రీకాంత్, మహేష్, ఆంజనేయులు, అశోక్ యాదవ్, అహ్మద్ పాషా, ఆంజనేయులు, శ్రీకాంత్, వెంకటేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు కార్తీక్ గౌడ్, షఫీజుద్దీన్, ఖాజా, ఫాయజ్, హరికృష్ణ, గౌస్, మహిళలు రాధ, పార్వతి, మంజుల, అనిత, సుధ, శాంత, సంగీత, కవిత, తన్విర్ బేగం, లలిత రాణి, వహీదా, నిర్మల, విజయ్, రజిని పాల్గొన్నారు .