నమస్తే శేరిలింగంపల్లి: దేశం గర్వించదగ్గ అభివృద్ధి జరగాలంటే బిజెపితో సాధ్యమని, తనను గెలిపిస్తే ఆ దిశగా కృషి చేస్తానని ఆ పార్టీ అభ్యర్థి రవికుమార్ యాదవ్ తెలిపారు.
గచ్చిబౌలి డివిజన్ , లక్ష్మి విహార్ ఫేజ్ 2 అసోసియేషన్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా అసోసియేషన్ వారు పలు సమస్యలు దృష్టికి ఆయన దృష్టికి తీసుకురాగా గెలిచిన వెంటనే పరిష్కరించి తీరుతామని హామీ ఇచ్చారు.
ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, 30వ తారీకున జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు పై ఓటు వేసి అఖండ మెజారిటీ గెలిపించాలని కోరారు.