- బిఆర్ఎస్ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ
- మియాపూర్ డివిజన్ పరిధిలో బిఆర్ఎస్ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ ప్రచారానికి వెల్లువెత్తిన ప్రజా మద్దతు
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లిలో భారీ మెజారిటీతో గెలిచి గులాబీ జెండా ఎగురవేస్తామని బిఆర్ఎస్ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ తెలిపారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ద్విచక్ర ర్యాలీని ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది ఏండ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజలు మెచ్చి మళ్ళీ పట్టం కట్టేందుకు సిద్ధమయ్యారని, ప్రచారంలో ఆ విషయం స్పష్టంగా కనపడుతున్నదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.