నమస్తే శేరిలింగంపల్లి : బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆరెకపూడి గాంధీకి మద్దత్తుగా కొండాపూర్ డివిజన్ లో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్పొరేటర్ హమీద్ పటేల్ ఆ చేపట్టిన ఈ ర్యాలీలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులతో కలసి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, యువ జన నాయకులు ఆదిల్ పటేల్ పాల్గొన్నారు. కొండాపూర్ డివిజన్ లోని ప్రతి బస్తీ కాలనీలలో బైక్ ర్యాలీ చేపట్టి ఎమ్మెల్యే గాంధీని గెలిపించాలని కోరారు.
కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుండి ప్రేమ్ నగర్ ఏ & బీ కాలనీలు , మార్తాండ్ నగర్, రాఘవేంద్ర కాలనీ ఏ & బీ & సీ కాలనీలు, రాజా రాజేశ్వరి కాలనీ, ఆనంద్ నగర్, జాగృతి కాలనీ, కొండాపూర్ జంక్షన్, సఫారీ నగర్, కొత్తగూడ, అంజయ్య నగర్, సిద్ధిక్ నగర్, వడ్డర బస్తీ, న్యూ పిజెఆర్ నగర్, ఓల్డ్ పిజెఆర్ నగర్, వసంత్ వ్యాలీ, డైమండ్ హిల్స్, సైబర్ హిల్స్, బయో డైవోర్సిటీ జంక్షన్ వరకు ర్యాలీ కొనసాగింది.