అభివృద్ధి పథంలో ముందుకెళ్లాలంటే బీజేపీతోనే సాధ్యం : శేరిలింగంపల్లి బీజేపీ ఇంఛార్జి రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : బిజెపి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మియాపూర్ డివిజన్ న్యూ కాలనీ లోని 329, 330, 331, 332, 334 బూత్ లలో బస్తి చలో కార్యక్రమం నిర్వహించారు. బిజెపి స్థానిక నాయకులతో కలిసి శేరిలింగంపల్లి బీజేపీ ఇంఛార్జి రవికుమార్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. ముచ్చటగా మూడోసారి బీజేపీ అధికారం చేపట్టబోతోందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్, బి.ఆర్.ఎస్ లకు ఓటు వేసిన మన ఓటు వృథా అవుతుందని హితవు పలికారు. దేశం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోవాలంటే రానున్న పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ కి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

న్యూ కాలనీ లో నిర్వహించిన బీజేపీ బస్తీబాటలో వాహనదారుడికి పార్టీ కరపత్రం అందజేస్తున్న బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి రవికుమార్ యాదవ్

ఈ కార్యక్రమంలో లింగంపల్లి కంటేస్టేట్ కార్పొరేటర్ ఏళ్లేష్, డివిజన్ అధ్యక్షులు మాణిక్ రావు, ఆకుల మహేష్, ఆకుల లక్ష్మణ్, విజయేందర్, గణేష్ ముదిరాజ్, రామకృష్ణ రెడ్డి, శివారెడ్డి, పవన్ యాదవ్, ఆంజనేయులు, సురేష్, ప్రభాకర్, రమేష్, రవీందర్ నాయక్, మంజుల, నాగేశ్వర రావు, శ్రీను, భాష శివా, జనార్ధన్ రెడ్డి, డేవిడ్, బాలకృష్ణ, ప్రసాద్, కార్యకర్తలు పాల్గొన్నారు.

బస్తీబాటలో నాయకులతో కలిసి..
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here