నమస్తే శేరిలింగంపల్లి : వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మిట్ట కంకల్ గ్రామపంచాయతీలో ప్రైమరీ స్కూల్లో బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్ తమ కుటుంబ సభ్యులతో సహా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకొని సరైన వ్యక్తిని ఎన్నుకోవాలని అన్నారు. ఓటు గెలుపోటమి కాదు భవిష్యత్తు బాట అని అన్నారు.