నమస్తే శేరిలింగంపల్లి : పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ లక్ష్మి దంపతులు స్థానిక పోలింగ్ బూత్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
భారత రాజ్యాంగం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిందని , ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.