నమస్తే శేరిలింగంపల్లి : నూతనంగా ఎన్నుకోబడిన మాధవనగర్ అసోసియేషన్ సభ్యులు మాధవనగర్ అధ్యక్షులు ఎన్ హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ ని మర్యాద పూర్వకంగా కలిశారు. మౌలిక సదుపాయాలు కల్పించి కాలనీ అభివృద్ధికి సహాయ, సహకారాలు అందించాలని కోరారు.
ఈ సందర్భంగా ఆయన సానుకూలంగా స్పందించారు. తప్పకుండా ఎల్లవేళలా కాలనీ అభివృద్ధి చేయడానికి ముందుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ నాగరాజు, జనరల్ సెక్రటరీ మైనం పాటి మూర్తి , జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్, సభ్యులు కృష్ణ గౌడ్, రాము, రంజిత్ పాల్గొన్నారు.