- మియాపూర్ నుండి ఇస్నాపూర్ వరకు మెట్రో కారిడార్ విస్తరణ నిర్ణయంపై సీఎం కెసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం
- బాణా సంచా కాల్చి, స్వీట్లు పంచి సంబురాలు
- ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ నుండి ఇస్నాపూర్ వరకు మెట్రో కారిడార్ విస్తరణ చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ సందర్బంగా మంత్రి, బీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మియాపూర్ మెట్రో స్టేషన్ లో కార్పొరేటర్లు హమీద్ పటేల్, జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు , బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల సమక్షంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి, స్వీట్లు పంచి, బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ హైదరాబాద్ మెట్రోను భారీగా విస్తరించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం.. రూ.60 వేల కోట్లతో హైదరాబాద్ నలువైపులా మెట్రో విస్తరణ చేపట్టడం చాలా సంతోషకరమైన విషయమని, దానిలో భాగంగా మియాపూర్ నుండి ఇస్నాపూర్ వరకు 13 KM మేర 3,250 కోట్ల రూపాయలతో మెట్రో విస్తరణచేపట్టడం శుభపరిణామమన్నారు.
మియాపూర్ నుండి లక్డికాపూల్ వరకు విస్తరణ చేపట్టడం గొప్ప విషయమన్నారు. ప్రజా సౌకర్యార్థం మియాపూర్ చౌరస్తా నుండి భేల్ చౌరస్తా వరకు పూణే నమూనా ప్రకారం మెట్రో మార్గం, ఫ్లై ఓవర్ ను ఒకే పిల్లర్ మీదుగా వచ్చే విధంగా నూతనంగా నిర్మాణం చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గతంలో శాసన సభ సమావేశాలలో తానూ మాట్లాడిన సంగతి విదితమేనని, పలుమార్లు సీఎం కేసీఆర్ దృష్టికి, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. నేడు గొప్ప చరిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం పట్ల సీఎం కేసీఆర్ కి, మంత్రి కేటీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్