ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దు

  • ప్రపంచ మహిళా దినోత్సవం, ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ బైక్ రైడ్

నమస్తే శేరిలింగంపల్లి : ప్రపంచ కిడ్నీ దినోత్సవం, ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మెడికవర్ హాస్పిటల్స్ బైక్ రైడ్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా అనిల్ కుమారు ఐపీఎస్, ఏడీజీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, తెలంగాణ పోలీస్, డాక్టర్ అనుపమ పండూరు, సీఐఐ ఐ డబ్ల్యూఎన్ తెలంగాణ & ఏవీపీ హెచ్ ఆర్ , సెనెకా గ్లోబల్ ఐటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పాల్గొని జెండా ఊపి రైడ్ ని ప్రారంభించారు.

మెడికవర్ హాస్పిటల్స్, హార్లీ డేవిడ్సన్ బైకర్స్ బృందం సంయుక్తంగా నిర్వహించిన బైక్ రైడ్

కిడ్నీ వ్యాధుల గురించి ప్రజలలో చైతన్య కలిగించడానికి, కిడ్నీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయరాదనే ఉదేశ్యంతో, కిడ్నీల రక్షణే అందరి ప్రధమ ధ్యేయం అనే నినాదంతో మెడికవర్ హాస్పిటల్స్, హార్లీ డేవిడ్సన్ బైకర్స్ బృందం (100 మంది) ఆదివారం సంయుక్తంగా బైక్ రైడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం మెడికవర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ సెంటర్ నుండి ప్రారంభించి మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ మీదుగా బేగంపేట మెడికవర్ హాస్పిటల్స్ కి వెళ్లి మెడికవర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ చేరుకున్నారు.
ఈ సందర్భంగా అనిల్ కుమారు ఐపీఎస్, డీజీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, తెలంగాణ పోలీస్ మాట్లాడుతూ ప్రజలకు కిడ్నీ వ్యాదులపై ఇలాంటి అవగాహన కార్యక్రమం నిర్వహించిన మెడికవర్ హాస్పిటల్స్ ని అభినందిస్తున్నానట్లు తెలిపారు. డాక్టర్ అనుపమ పండూరు మాట్లాడుతూ మారిన జీవన శైలి, సరైన పోషకాలు లేని ఆహారం తీసుకోకపోవడం, సమయానికి తినకపోవడం, నీరు ఎక్కువగా తాగకపోవడం, వ్యాయామం చేయకపోవడం కిడ్నీ సమస్యలకు కారణాలవుతున్నాయని తెలిపారు.


ఈ సందర్భంగా డాక్టర్ కమల్ కిరణ్ (నెఫ్రోలజి & కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ విభాగపు డైరెక్టర్ -మెడికవర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ ) మాట్లాడుతూ కిడ్నీలు మానవ శరీరంలోని ప్రధాన అవయవాలలో ఒకటని, రక్తాన్ని శుద్ధి చేసి అందులోనుంచి హానికరమైన మలినాలను తొలగించి, తిరిగి శుద్ధమైన రక్తాన్ని శరీరానికి అందించే కీలక పాత్రను కిడ్నీలు పోషిస్తాయని పేర్కొన్నారు. కిడ్నీ వ్యాధుల పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల తొలి దశలో వ్యాధిని గుర్తించడానికి వీలుకాని పరిస్థితి ఏర్పడిందని, మనదేశ జనాభాలో 10 శాతం మంది దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నారని చెప్పారు. క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ), జనాభాలో 17.2% మందిని ప్రభావితం చేస్తోన్నట్లు తెలిపారు. మధుమేహం, రక్తపోటు సీకేడీ వ్యాప్తికి ప్రధాన కారణాలన్నారు. భారతదేశంలో సుమారు 60 మిలియన్ల మందికి మధుమేహం ఉందని అంచనా వేయబడిందని, వారిలో దాదాపు 25% మంది సీకేడీ బారిన పడవచ్చునని చెప్పారు.
అనంతరం మెడికవర్ హాస్పిటల్స్ చీఫ్ అఫ్ బిజినెస్ ఆపరేషన్స్ – మహేష్ డెగ్లూర్కర్ మాట్లాడుతూ ” కిడ్నీ సేవలకు ప్రత్యక విభాగం, ప్రత్యేక స్క్రీనింగ్ ప్యాకేజీలు, అనుభవజ్ఞులైన డాక్టర్లు, అత్యుత్తమ సాంకేతికత కలిగిన వ్యాధి నిర్ధారణ పరికరాలు మెడికవర్ హాస్పిటల్స్ లో ఉన్నాయనీ, లక్షలాది మందికి డయాలసిస్ సేవలు అందిస్తున్నామని, దేశీయ, విదేశీ రోగులకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్లను ఎంతో నైపుణ్యంతో విజయవంతంగా చేస్తున్నామని అన్నారు. విశ్వసనీయ కిడ్నీ సేవలకు మెడికవర్ పెట్టింది పేరన్నారు.
ఈ కార్యక్రమంలో నెఫ్రోలోజిస్ట్ డాక్టర్ అరుణ్ కుమార్, తెలంగాణ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ దుర్గేష్, హర్లీ ఓనర్స్ బృందం, బంజారా చాప్టర్ సుధీర్ రెడ్డి, సెంటర్ హెడ్ అనూష, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here