చెరువుల సుందరీకరణే ప్రధాన ధ్యేయం : ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : చెరువు సుందరీకరణ, సంరక్షణ, అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని మీది కుంట చెరువు అభివృద్ధిలో భాగంగా ఎమ్మెల్యే సీడీపీ నిధులతో ఫౌంటేయిన్ హెడ్ ద గ్లోబల్ స్కూల్ యాజమాన్యం, మాతృ శ్రీనగర్ సంక్షేమ సంఘం భాగస్వామ్యంతో చేపట్టనున్న చెరువు సుందరీకరణ, సంరక్షణ, అభివృద్ధి పనులకు శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్, జీహెచ్ఎంసీ స్టాండింగ్ సభ్యులు, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు.

మీదికుంట చెరువు అభివృద్ది పనులకు శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్, జీహెచ్ఎంసీ స్టాండింగ్ సభ్యులు, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ఎమ్మెల్యే సీడీపీ నిధులతో ఫౌంటేయిన్ హెడ్ ద గ్లోబల్ స్కూల్ ఫౌండర్ అండ్ ఛైర్ పర్సన్ మేఘన ముసునూరి వారి పాఠశాల విద్యార్థులు, మాతృశ్రీ నగర్ సంక్షేమ సంఘం భాగస్వామ్యంతో కలిసి చెరువును అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. సమాజ హితం మంచి పనులు చేయడం పట్ల మేఘన ముసునూరిని అభినందించారు. చెరువు సుందరీకరణ, అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. మీదికుంట చెరువును సుందరవనంగా , శోభితవర్ణంగా తీర్చిదిద్దుతామని స్థానికులకు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ హెడ్ ద గ్లోబల్ స్కూల్ ఫౌండర్ అండ్ ఛైర్ పర్సన్ మేఘన ముసునూరి, శ్రీధర్, లేక్ మాన్ ఆఫ్ ఇండియా ఆనంద్, మలిగావెద్, చైతన్య, రాము, కల్పన, సుధా, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, గౌరవ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సాంబశివరావు, భిక్షపతి ముదిరాజ్, కావూరి అనిల్, రఘునాథ్, సాంబయ్య, మామిడాల రాజు, రాజయ్య, గంట వాసు, విజయ్, రమేష్, సతీష్, అనిల్, శ్రీనివాస్ రెడ్డి కాలనీ వాసులు పాల్గొన్నారు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here