- మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి: మట్టి గణపతిలను పూజించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడదామని బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ బొబ్బ నవత రెడ్డి పిలుపునిచ్చారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ లో కైలాష్ నగర్, ఆదర్శ్ నగర్, శాంతి నగర్, కృష్ణదేవరాయ కాలనీ, విశ్వేశ్వరయ్య కాలనీ, హుడా ఫేస్ 2, వెంకటాద్రి కాలనీ, జవహర్ కాలనీ సౌత్, జవహర్ కాలనీ నార్త్, శంకర్ నగర్, న్యూ శంకర్ నగర్, భవాని శంకర్ నగర్, భవనిపురం, భిక్షపతి ఎనక్లేవ్, వేముకుంట, సాయి కీర్తి అపార్ట్ మెంట్ శ్రీ లక్ష్మీ శుభం ఆర్కేడ్, వివన్తా అపార్ట్మెంట్ , సత్యనారాయణ ఎనక్లేవ్ అపార్ట్ మెంట్, కాలనీలో సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరబోయిన రవి కుమార్ సౌజన్యంతో సుమారు 5000 వేల ఉచిత మట్టి వినాయకులను పంపిణీ చేశారు.
బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ బొబ్బ నవత రెడ్డి ఆ విగ్రహాలను పంపిణీచేశారు. ఆ సందర్భంగా నవత రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ మట్టి వినాయకులనే ప్రతిష్టించాలని, రాబోయే భావితరాలకు అందరం ఆదర్శంగా ఉండాలని, ఈ వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ ఈ సంవత్సరం అందరూ సుఖసంతోషాలతో బాగుండాలని, ఆ వినాయకుని ఆశీస్సులు అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శేరిలింగంపల్లి నియోజికవర్గం ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.