స్వర మహతీ కళా పరిషత్ ఆధ్వర్యంలో వినాయక విగ్రహాల పంపిణీ

నమస్తే శేరిలింగంపల్లి : స్థానిక స్వర మహతీ కళా పరిషత్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ పాల్గొని మాట్లాడుతూ ప్రకృతి పరిరక్షణలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చాల శుభదాయకమని, ఆ గణేష్ మహారాజ్ ఆశీస్సులు అందరిపై ఉంటుందని తెలిపారు.

ఈ సందర్భంగా స్వర మహతి కల పరిషత్ అధ్యక్షుడు డా ఆదిత్య కిరణ్ , సభ్యులను అభినందించారు. ఆదిత్య మాట్లాడుతూ పవిత్ర సనాతన ధర్మాన్ని, ప్రకృతిని కాపాడే ప్రయత్నంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని దాదాపు 500 విగ్రహాలను పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వై వి.వి.ఎస్ లక్ష్మణ్ , శ్రీనివాస్ రాజ్ ముదిరాజ్ , కుమార్ దేవులపల్లి తులసి, వెంకట లక్ష్మి, వెంకట రమణ, అవిక్షిత్, వివిక్త కళా పరిషత్ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here