నమస్తే శేరిలింగంపల్లి : పవిత్రమైన రంజాన్ మాసం ఉపవాస దీక్షలో భాగంగా మార్తాండ నగరలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహిపల్ యాదవ్ పాల్గొన్నారు.
ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్న వారు రంజాన్ పండుగ ప్రజల జీవితాలలో సుఖసంతోషాలను నింపాలని ఆ అల్లాహ్ ను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మనేపల్లి సాంబశివరావు, ఎం.డి బషీరుద్దీన్, ఎం.డి గౌసుద్దీన్, ఎం.డి నజరుద్దీన్, ఎం.డి ఫిరోజ్, షేక్ చంద్ పాషా, సయ్యద్ నవాజ్ అలీ, రషీద్, ఎం.డి ఫాయీమ్, జానీ, గోపాల్ నాయక్, ఎం.డి ఇబ్రహీం, గౌస్ పాషా పాల్గొన్నారు.