నమస్తే శేరిలింగంపల్లి : నేతాజీ నగర్ కాలనీ అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ చొరవతో ఆ కాలనీవాసులకు డ్రైనేజీ సమస్య తొలగిపోయింది. శేరిలింగంపల్లి గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిండిపోయి రోడ్డుమీద దుర్వాసనతో కాలనీవాసులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం తెలుసుకొని జలమండలి సిబ్బందికి సూపర్ వైజర్ సురేష్ కు నేతాజీ నగర్ కాలనీ అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ సమాచారం అందించారు.
జలమండలి సిబ్బందితో ఈ సమస్యను దగ్గరుండి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ని పరిశుభ్రం చేయించారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ కాలనీలో ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నానని, కాలనీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, కాలనీ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని, కాలనీ శ్రేయస్సు కోసం అనుక్షణం పనిచేస్తానని అన్నారు.