- వరద ముంపు ప్రాంతాల్లో చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పర్యటన
నమస్తే శేరిలింగంపల్లి: గత ముడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చందానగర్ డివిజన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో జిహెచ్ ఎంసీ అధికారులతో కలిసి చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పర్యటించారు. దీప్తిశ్రీ నగర్, కేఏస్అర్ ఎన్ క్లేవ్, వేమన వికర్ సేక్షేన్ కాలనీ ఇంద్ర నగర్ పలు కాలనీలు పర్యటించి స్థానికులను అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు అవసరం అయితే తప్ప బయటకు రావద్దని సుచించారు.. ఈ సందర్భంగా మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ జిహెచ్ ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు వరద ముంపు ప్రాంతాల్లోని వరద నీరును మెటర్లు ద్వారా వరద నీటి కాలువల్లోకి పంపిస్తున్నారని, ప్రధాన రహదారులపై కాలని అంతర్గత రోడ్లలో ఉన్న మ్యాన్ హోల్స్ లో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తున్నారని తెలిపారు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కాలనిలలో మ్యాన్ హోల్స్ ముత తేరవడం లాంటివి చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.