- అప్రమత్తంగా ఉండాలంటూ మిద్దెల మల్లారెడ్డి సూచన
- అక్రమ సెల్లార్లు పూడ్చాలని ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని అధికారులపై మండిపాటు
నమస్తే శేరిలింగంపల్లి: అక్రమ సెల్లార్లతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయని ముందే ఫిర్యాదు చేసిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఉద్యమకారులు మిద్దెల మల్లారెడ్డి మండిపడ్డారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని చందానగర్ సర్కిల్ పరిధిలో గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రతి సెల్లార్ జలమయం అయ్యాయని తెలిపారు. పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఏదైనా అనుకోని విపత్తు జరిగితే అధికారులే సమాధానం చెప్పవలసి ఉంటుందని, తెలంగాణ ప్రభుత్వం ప్రతి విషయానికి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూ ఉంటే అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 15 రోజుల క్రితమే జూలై మొదటి వారంలోనే చందా డివిజన్ పరిధిలోని అమీన్ పూర్ వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకొని కైలాస్ నగర్ వెళ్లే మూలమలుపులో భారీ సెల్లార్ కడుతున్నారని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశమని, ప్రముఖ దినపత్రికలలో కూడా ప్రచురితమయ్యాయని, కానీ ఇంతవరకు ఆ సెల్లార్ ను పూడ్చలేదని, చందానగర్ టౌన్ ప్లానింగ్ అధికారులు, ఉన్నత అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని మిద్దెల మల్లారెడ్డి కోరారు.