నమస్తే శేరిలింగంపల్లి: ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. యు.కృష్ణ (30) సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. మియాపూర్ లోని విజేత సూపర్ మార్కెట్ వద్ద గోకుల్ బ్లాక్ లో 402 లో నివసిస్తున్నాడు.
8వ తేదీన ఇంట్లోంచి బయటికి వెళ్లిన కృష్ణ తిరిగి రాకపోవడంతో ఆయన సంబంధికులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.