నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని డైనమిక్ కాలనీ, ప్రజయ్ షెల్టర్, బుద్ధ వర్షిత్ అపార్ట్మెంట్స్, తేజ హోమ్స్ అపార్ట్మెంట్స్ లలో
కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ సతీమణి సుమలత, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సతీమణి శ్యామల దేవి ఇంటింటి ప్రచారం చేపట్టారు.
కుమారుడు పృథ్వీ గాంధీ, కోడలు భార్గవి, కుమార్తె ప్రణీత గాంధీలతో కలిసి ఇంటింటికో తిరిగి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా శ్యామల దేవి అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి తోడ్పడే విధంగా మ్యానిఫెస్టో ఉందని, సబ్బండ వర్గాల ప్రజలకు ఉపయోగంగా ఉందని, రాబోయే ఎన్నికల్లో విజయం తధ్యం అని,బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని శ్యామల దేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.