నమస్తే శేరిలింగంపల్లి : జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్ లో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ 8వ వార్షికోత్సవం కనులపండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ, తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ప్రముఖ హీరో మురళి మోహన్, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ బిల్డర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కారిస్తానని, తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు. అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. నాలా సమస్య, బిల్డర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. కార్యక్రమంలో బిల్డర్స్, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.