నమస్తే శేరిలింగంపల్లి: తల్లి మందలించడంతో కొడుకు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాయదుర్గం పిఎస్ పరిధిలో చోటుచేసుకుంది. జస్వంత్ కార్తీక్ ఇద్దరు కుమారులు. పీజేఆర్ నగర్ లోని రహమత్ గుల్షన్ కాలనీ లో నివాసం ఉండే ఆమె కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు.
అయితే మధుర నగర్ లోని ప్రభుత్వ కళాశాలలో విద్యనభ్యసించే తన చిన్న కుమారుడు 20వ తేదీన సాయంత్రం 4.30 గంటలకు రావాల్సి ఉండగా ఆలస్యంగా 6.30కు వరకు రావడంతో తల్లి మందలించింది. ముగ్గురు భోజనం చేసి పడుకున్నారు. 21వ తెల్లవారు 4.30కు పెద్దకుమారుడు కార్తీక్ తో కలిసి కూరగాయల మార్కెట్ కి వెళ్ళింది. తిరిగి 7.15 నిమిషాలకు తిరిగి వచ్చారు. తలుపు తట్టిన స్పందించకపోవడంతో గదిలోని వెంటిలేటర్ నుంచి చూడగా జస్వంత్ ఫ్యాన్ కి చీరతో ఊరుకుని కనిపించాడు. వెంటనే వారు తలుపు పగులగొట్టి జస్వంత్ ని కి కిందికి దించి సిపియార్ చేశారు. కాని అప్పటికే మరణించాడు. దీంతో రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.