నమస్తే శేరిలింగంపల్లి : ఉద్యోగాని కోసం వెళ్లి ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. వివరాలు.. 14వ తేదీన కేఆర్. అనుదీప్ కుమార్ (33) సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉద్యోగాల కోసం వెతకడానికి వెళ్లాడు. తిరిగి ఇంటికి రాలేదు. ఈ విషయం అతడి బావ పవన్ కళ్యాణ్ (25) 16వ తేదీన మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనతోపాటు ఉద్యోగాల కోసం వెతికేవాడని ఫిర్యాదు పేర్కొన్నాడు.
అంతేకాక మార్చి 2023న కూడా తన కోసం వెతకవద్దు అని రాసి ఇంటి నుంచి వెళ్లిపోయి తర్వా ఇంటికి వచ్చాడని, కానీ ఇప్పుడు రాలేదని పేర్కొన్నారు.