నమస్తే శేరిలింగంపల్లి : ఛాతీ నొప్పి తీవ్రతరమవడంతో హాస్పిటల్ వెళ్లేలోపు మరణించిన ఓ వ్యక్తి మరణించిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు గుడిమల్కాపూర్ కొత్త సాయినగర్ రోడ్ నెం 2లో పి. ప్రశాంత్ (29) తో కలిసి నిమ్మకాయల సాయికుమార్ (27) నివసిస్తున్నాడు. అయితే 15వ తేదీన మియాపూర్ మసీదు దగ్గర ప్రేమ్ నగర్ వీధి నంబర్ 14లో తన స్నేహితుడితో కలిసి ఉండగా.. 6 గంటలకు ఛాతీ నొప్పి అధికమవడంతో కూప్పకూలాడు. వెంటనే అతనిని మామ ఫణికుమార్ (43) అతని స్నేహితులు స్థానికంగా ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ విషయమై ప్రశాంత్ తన స్నేహితుడు వెంకటసాయికి కాల్ చేయగా.. విషయం చెప్పాడు. మధ్యాహ్నం 2 గంటలకు ఛాతి నొప్పి వస్తుందని టాబ్లెట్ష్ వేసుకున్నాడని, సాయంత్రం 5.20 గంటలకు నిద్రలేని ఛాతీ నొప్పి తీవ్రంగా కిందపడిపోయాడు. వెంటనే కిమ్స్ ఆసుపత్రికి తరలించామని, అక్కడ డ్యూటీ డాక్టర్ పరీక్షించి మరణించినట్లు చెప్పడని ప్రశాంత్ కు తెలిపాడు. వెంటనే ప్రశాంత్ మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.