- కూకట్ పల్లి జోనల్ కమీషనర్, డిప్యూటీ కమీషనర్ కి కాంగ్రెస్ నాయకులు ఏకాంత్ గౌడ్ ఫిర్యాదు
నమస్తే శేరిలింగంపల్లి: రోడ్డు ఆక్రమణతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు ఏకాంత్ గౌడ్ ఆరోపించారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని గత ప్రభుత్వ హయాంలో బిఆర్ ఎస్ నాయకులమని చెప్పుకొని చెన్నయ్ షాపింగ్ మాల్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నిర్వాహకులు రోడ్డును కబ్జా చేసి ర్యాంప్ లను నిర్మించి పార్కింగ్ ఏర్పాటు చేశారు. దీనివల్ల నిజాంపేట్ వరకు ట్రాఫిక్ జాం ఏర్పడుతూ ప్రజలు నరకం చూస్తున్నారని తెలిపారు.
ఈ విషయాన్ని కూకట్ పల్లి జోనల్ కమీషనర్, డిప్యూటీ కమీషనర్ కి ఫిర్యాదు చేయడంతో వారు సానుకూలంగా స్పందించి షాపింగ్ మాల్స్ కి నోటీసులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పల్నాటి అశోక్, రమేష్, నవీన్, నాగరాజు, పాల్గొన్నారు.