నమస్తే శేరిలింగంపల్లి : మాధవ బృందావన్ అపార్ట్మెంట్ లో గణేశ్ నవరాత్రోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఘనంగా పూజలు అందుకున్నాడు గణనాథుడు. అనంతరం నిమజ్జన కార్యక్రమం నిర్వహించగా.. ఎమ్మెల్యే గాంధీ, స్థానిక కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి , అపార్ట్మెంట్ అధ్యక్షుడు తాడూరు గోవర్థన్ రెడ్డి పాల్గొని పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు.
నిమజ్జనోత్సవం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టున్నాయి. చిన్నారులు నృత్యాలు మైమరపింపజేశాయి. అనంతరం లడ్డూ వేలం పాట నిర్వహించగా.. పెద్ద లడ్డూను రూ. 60 వేలకు సంగీత కేజ్రీవాల్, చిన్న లడ్డూను రూ. 16 వేల 500లకు మహిపాల్ రెడ్డి కైవసం చేసుకున్నారు.