ఫోటోలకు ఫోజులిచ్చేటోళ్లం కాదు… ప్రజల కోసం పనిచేసేటోళ్లం

  • కొందరు స్వార్థపరుల బురద రాజకీయాలపై ఘాటుగా విమర్శలు
  • లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్న ప్రభుత్వ విప్ గాంధీ
    నిత్యావసరాలు పంపిణి

నమస్తే శేరిలింగంపల్లి: వర్షాలు పడగానే వచ్చి ఫోటోలు దిగేటోళ్లం కాదని, ప్రజల్లో ఉంటూ వారి సంక్షేమం కోసం పనిచేసేటోళ్లమని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపు ప్రాంతాలలో కలిగే సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి ముంపు, లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి, ఆయా సమస్యలను పరిశీలించారు. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని గురుగోవింద్ సింగ్ నగర్, పీజేఆర్ నగర్ ఫేస్ 1 కాలనీలలో చేపడుతున్న సహాయక చర్యలను కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, CI క్రాంతి కుమార్ , జీహెచ్ ఎంసీ అధికారులతో కలిసి పర్యటించి .. ఇంటింటికి వెళ్లి ప్రజల యోగ క్షేమలు తెలుసుకున్నారు.

అనంతరం వరద బాధితులకు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ సహాయక చర్యలను ముమ్మరంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే కొందరు స్వార్థపరులు బురద రాజకీయాలు చేస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. గత 9 ఏళ్లుగా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ అనునిత్యం ప్రజాలతోనే మమేకమై ఉంటూ కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్న ఘనత బీఆర్ ఎస్ ప్రభుత్వానిదని, ఎడతెరపి లేని వర్షాలు పడి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కొందరు నాయకులు వచ్చి ఫోటోలకు ఫోజులు ఇచ్చి, ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని వారంతా టూరిస్ట్ లని ఎద్దేవా చేశారు ఆల్విన్ కాలనీ అభివృద్ధి కోసం సుమారు రూ.180 కోట్లు కేటాయించి అనేక అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడించారు. లో లెవల్ లో కట్టిన ఇళ్లలోకి నీరు చేరిందని, అప్పటికే ఒక మీటర్ లోతు మేర పైప్ లైన్ వేసిన పైన నుండి భారీగా వచ్చిన వరదకు తోడు, నీటి ప్రవాహానికి అడ్డంగా కట్టిన ఓ బిల్డింగ్ వల్ల సిక్కుల బస్తీలో ఇళ్లలోకి నీరు చేరిందని తెలిపారు. ఆ బిల్డింగ్ ఎలా కట్టారు, దానికి ఎవరు అనుమతులు జారీ చేశారు అన్నదానిపై ఇప్పటికే జోనల్ కమిషనర్ విచారణ చేపట్టారని, భవిష్యత్తులో అలాంటి నిర్మాణాలు జరగకుండా, లోతట్టు ప్రాంతాలు నీట మునగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీకాంత్, జీహెచ్ ఎంసీ అధికారులు ఎఇ శ్రావణి, వర్క్ ఇన్ స్పెక్టర్ రవి కుమార్, ఆల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సమ్మారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాశినాథ్ యాదవ్, చిన్నోళ్ల శ్రీనివాస్, గుడ్ల శ్రీనివాస్, శివరాజ్ గౌడ్, షౌకత్ అలీ మున్నా, సంగమేష్, యాదగిరి, రాములుగౌడ్, వాలి నాగేశ్వరరావు, కూర్మయ్య, భిక్షపతి, సంతోష్ బిరాదర్, కె.శ్రీనివాస్, కటికరవి, సాయిగౌడ్, రాజు, లాఖన్ సింగ్, మారుతి, రాజ్యలక్ష్మి, మధు లత, శిరీష శాత్తూర్, షేక్ బీబీ, పుట్టం దేవి, రేణుక. సురేఖ. ప్రీతి, రమాదేవి, పర్వీన్, లలిత కుమారి, లక్ష్మి , కాలనీ వాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here