శేరిలింగంపల్లి, జూలై 15 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ డబుల్ బెడ్ రూమ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని వివేకానంద నగర్ లోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా డబుల్ బెడ్ రూమ్ కాలనీ వాసులు మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయానికి ప్రహరీ గోడ ఏర్పాటు చేయాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, సీసీ రోడ్డును వేయాలని, మంచి నీటి బోరు ఒకటి వేయించాలని కోరారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ త్వరలోనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయంలో పర్యటిస్తానని, చుట్టూ ప్రహరీ గోడ నిర్మిస్తామని, కాలనీ లో నెలకొన్న అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని అన్నారు. అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని, అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లను అతి త్వరలో చేపట్టి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో సాయి నగర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుదేశ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ శ్రవణ్ కుమార్, జనరల్ సెక్రటరీ చంద్రయ్య, జాయింట్ సెక్రటరీ సక్రూ, ట్రెజరర్ నర్సింహ రెడ్డి, అడ్వైజర్లు శ్యామ్, నర్సింలు, ఎక్జిక్యూటివ్ మెంబర్లు కూర్మయ్య, మహేందర్, సాయిరాం, సూర్య, మెంబర్స్ శ్రీను, అర్జున్, దుర్గయ్యా, నికరణ, శంకర్, సాయి కుమార్, నవీన్, రాజు, యేసు, మోజేశ్, జైపాల్, సునీల్, రాములు, క్రాంతి, అభిలాష్, ఆనంద్, సాయి తదితరులు పాల్గొన్నారు.