మున్నూరు కాపులకు ఓరియంటేషన్ శిక్షణ తరగతులు నిర్వహించడం హర్షణీయం: ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

శేరిలింగంపల్లి, జూలై 15 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): కులమతాలకు అతీతంగా ఐక్యతతో ముందుకు సాగితేనే రాజకీయ మనుగడ సాధ్యమవుతుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. మున్నూరు కాపులకు రాజకీయ పార్టీల తరహాలో ఓరియంటేషన్ శిక్షణ తరగతులు నిర్వహించడం శుభ పరిణామని అన్నారు. బడుగు బలహీన వర్గాలు ఏకతాటిపై రావాల్సిన అవసరం ఉందని అన్నారు. చందానగర్ లోని సుప్రజ గార్డెన్స్ లో మంగళవారం మున్నూరు కాపు లకు ఒకరోజు ఓరియంటేషన్ శిక్షణ తరగతుల సదస్సుకు ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. కార్యక్రమానికి మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పుటం పురుషోత్తం రావు పటేల్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఇలాంటి శిక్షణా తరగతులను నిర్వహించామని అన్నారు. మున్నూరు కాపుల నాయకత్వం గ్రామస్థాయిలో బలోపేతం చేయాలని సూచించారు.

ఆత్మ గౌరవ భవనం కోసం గత ప్రభుత్వం మంజూరు చేసిన ఐదు కోట్ల రూపాయలు తిరిగి మున్నూరు కాపు భవనం నిర్మాణం కోసం మంజూరు అయ్యేలా కృషి చేస్తానని, అందులో మున్నూరు కాపులు పేరు చివరన పటేల్ అని వచ్చేలా గెజిట్ లో నమోదు అయ్యేలా కృషి చేస్తానని ఆది శ్రీనివాస్ హామీ ఇచ్చారు. మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుటం పురుషోత్తం రావు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా మున్నూరు కాపుల సంక్షేమం కోసం సంఘ నిర్మాణం కార్యక్రమం ఉంటుందని అన్నారు. వామపక్షాలు తదితర పార్టీల తరహాలో మున్నూరు కాపులకు ఒకరోజు శిక్షణా తరగతులు నిర్వహించడం మున్నూరు కాపు సంఘానికే గర్వకారణం అని అన్నారు. టిఎస్సీ పిసి మాజీ సభ్యుడు విటల్, జలమండలి కార్పొరేషన్ మాజీ చైర్మన్ వి.ప్రకాష్, రౌతు కనకయ్య, మున్నూరు కాపుల విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున్ ససాలా ఓరియంటేషన్ శిక్షణా తరగతులలో వివిధ అంశాలపై బోధించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్, అపెక్స్ కమిటీ సభ్యులు గాలి అనిల్ కుమార్, మీసాల చంద్రయ్య, తూడి ప్రవీణ్, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్ది పెంటయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ లు డాక్టర్ బుక్క వేణుగోపాల్, డాక్టర్ జెఎన్ వెంకట్, చల్లా హరిశంకర్, మహిళా వింగ్ ప్రెసిడెంట్ బండి పద్మ, కోశాధికారి సత్యనారాయణ ప్రసంగించగా, ఉపాధ్యక్షులు వాసాల వెంకటేశ్వర్లులు రాష్ట్రంలోని నియోజకవర్గ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here