శేరిలింగంపల్లి, జూలై 17 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని కృషినగర్ కాలనీలో ఉన్న నారాయణ కాలేజ్ నుండి దీప్తి శ్రీ నగర్ కాలనీ లోని సాయి సుకదం అపార్ట్మెంట్ వరకు రూ. 45లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మాణం చేపట్టబోయే వరద నీటి కాలువ(Storm Water Drain) నిర్మాణం పనులను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి, GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా 45 లక్షల నిధులతో వరద నీటి కాల్వ నిర్మాణం పనులను చేపట్టడం జరిగిందని, వరద నీరు కాల్వ నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేసి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడాలని , వర్షాకాలంను దృష్టిలో పెట్టుకొని పనులలో జాప్యం లేకుండా , వర్షాకాలం ను దృష్టిలో పెట్టుకొని పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులు AE సంతోష్, వర్క్ ఇన్స్పెక్టర్ నవీన్, నాయకులు అక్బర్ ఖాన్, MD ఇబ్రహీం, నరేందర్ బల్లా, యూసఫ్, సందీప్ రెడ్డి, మహ్మద్ కాజా తదితరులు పాల్గొన్నారు.