శేరిలింగంపల్లి, జూలై 15 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని అల్లూరి సీతారామరాజు నగర్ కాలనీలో నూతనంగా నిర్మాణం చేపట్టిన Storm Water Drain వరదనీటి కాలువ నిర్మాణ పనులను జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చేపట్టిన వరద నీటి కాల్వ నిర్మాణం పనులను జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలసి పరిశీలించడం జరిగిందని, వరదనీటి కాల్వ నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేసి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడాలని,రాబోయే వర్షాకాలం ను దృష్టిలో పెట్టుకొని పనులలో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని అన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో GHMC అధికారులు EE ఇందిరా బాయ్, DE దుర్గా ప్రసాద్, AE సంతోష్, స్థానిక నాయకుడు ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.