శేరిలింగంపల్లి, జూలై 17 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని చందానగర్ సర్కిల్లో ఉన్న చందానగర్ జీహెచ్ఎంసీ కల్యాణ మండపంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో దాదాపు 400 మంది పారిశుద్ధ్య కార్మికులకు TB, HIV, BP, DIABETIC, ఇతర వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అవసరం ఉన్నవారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అవసరమైన వారికి ఎక్స్రేలు తీశారు. వందరోజుల TB కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఆరోగ్య శిబిరాలను ప్రజలు వినియోగించుకొని ఎవరికైతే రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు ఉంటాయో వారు వెంటనే ఆరోగ్య శిబిరాలను సందర్శించి వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రవికుమార్, S.S శ్రీనివాస్, ACP Nagi Reddy, శేరిలింగంపల్లి phc ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ ఉమాదీపిక, TB వైద్య సిబ్బంది సూపర్ వైజర్ బీములు, సుధాకర్, ల్యాబ్ టెక్నీషియన్ ప్రసన్నలత, TBHV సంతోష్, S.A సతీష్, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.






