శేరిలింగంపల్లి, జూలై 17 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని సర్కిల్ 21 చందానగర్ లో అక్రమ కట్టడాలు జోరు అందుకున్నాయని, అక్రమ నిర్మాణాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానిక సీనియర్ నాయకుడు మిద్దెల మల్లారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సర్కిల్‌లో జూన్ 25న ఇద్దరు చైన్‌మెన్‌లను ఒకేసారి పదోన్నతిపై బదిలీ చేశారని అన్నారు. ఇప్పటి వరకు వారి స్థానాలను భర్తీ చేయలేదన్నారు. ఇదే అదనుగా చేసుకున్న కొందరు బిల్డర్లు యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని అన్నారు. కనుక సంబంధిత అధికారులు వెంటనే చైన్ మెన్లను నియమించాలని, స్థానిక సర్కిల్ పరిధిలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.