ఆదిభట్ల శ్రీ చైతన్య స్కూల్‌లో ఘనంగా గ్రీన్ ఇండియా మిషన్

శేరిలింగంపల్లి, జూలై 17 (న‌మస్తే శేరిలింగంపల్లి): పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు నడుం బిగించాలని పర్యావరణ పరిరక్షణతోనే సమస్త ప్రాణి కోటి మనుగడ సాగుతుందని శ్రీ చైతన్య విద్యాసంస్థల దిల్‌సుఖ్‌న‌గర్ జోన్ ఏటీఎం సతీష్ తెలిపారు. గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి, ప‌చ్చదనాన్ని, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడానికి శ్రీ చైతన్య విద్యాసంస్థలు స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాం లో భాగంగా గ్రీన్ ఇండియా మిషన్ నిర్వహించారు. పచ్చదనం పరిశుభ్రతలో భాగంగా ఆదిభట్ల శ్రీ చైతన్య పాఠశాల ఆవరణలో ప్రిన్సిపల్స్ సతీష్, హుస్సేన్ ఆధ్వర్యంలో స్కూల్ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు మొక్కలు నాటి నీరు పోశారు.

ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఏ జీ ఎం సతీష్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పర్యావరణంపై జరుగుతున్న ప్రయోగాల వ‌ల‌న‌ జీవకోటి మనుగడకు ముప్పు వాటిల్లేందుకు మానవులే కారణమవుతున్నారని అన్నారు. విచక్షణారహితంగా చెట్లను నరికి వేయడం వలన మానవ వినాశనం అవుతుంద‌ని, క‌నుక ప్రతి ఒక్కరూ ఒక్కొక్క చెట్టును తమ పుట్టినరోజు సందర్భంగా రెండు చెట్లను నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని అన్నారు. మానవాళి భవిష్యత్తుకు వెలుగుల నింపి రేపటి భావితరాలకు కాలుష్య రహిత వాతావరణం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ లు వెంకట్ రెడ్డి, రవీందర్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మల్లం వెంకటేశం గౌడ్, డీన్లు, ఇన్చార్జిలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here