శేరిలింగంపల్లి, జూలై 15 (నమస్తే శేరిలింగంపల్లి): పేదల నివాసాల స్థలాల్లోనే ఇండ్లు నిర్మించి ఇవ్వాలని అఖిల భారత ప్రజాతంత్ర సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి డివిజన్ గౌలిదొడ్డి విలేజ్ పరిధిలోని బసవతారక నగర్ బస్తీ వాసులు ఏర్పాటు చేసిన దీక్ష శిబిరాన్ని సందర్శించి అనంతరం వారిని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ పేద ప్రజలు నివసిస్తున్న ప్రజల కు కావలసిన నివాస స్థలాన్ని ఇక్కడే ఇచ్చి వారికి ఇండ్లు కట్టుకునేందుకు ప్రభుత్వం సాయం చేయాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం వామపక్ష పార్టీలు సిపిఎం, సిపిఐ, ఎం సి పి ఐ యు ఆధ్వర్యంలో సంఘీభావ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహిళా సంఘం నాయకురాలు వామపక్ష నాయకులు మాట్లాడుతూ బసవతారక నగర్ ప్రజలు నివసిస్తున్న ప్రాంతాన్ని ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వ భూమిగా గుర్తించడం తమ పోరాటానికి గుర్తింపును తెచ్చిందని వారు అన్నారు.
వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అనునిత్యం పేదల పక్షాన పోరాటం నిర్వహిస్తూనే ఉన్నామని వారు గుర్తు చేశారు. పేదల పక్షాన అనునిత్యం పోరాటం చేసే ఎర్రజెండాను ప్రజల వద్దకు మరింత ముందుకు తీసుకెళ్తామని వారు తెలిపారు. బసవతారక నగర్ ప్రజలపై కొంతమంది పాలకపక్ష నాయకులు ప్రతిపక్ష నాయకులు వారిపై కపట ప్రేమ కురిపిస్తూ వారి ఇంటి స్థలాన్ని కాజేయాలని ప్రయత్నం చేశారని వారు ఆరోపించారు. వారి వెంట నే ఉంటూ వారికి మేలు చేస్తామని అనేక దొంగ హామీలు ఇచ్చారని వారు గుర్తు చేశారు. ప్రజలు ఏ పార్టీ ఎవరి పక్షాన పోరాడుతారో గుర్తుంచుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ వామపక్ష సంఘాల నాయకులు పాల్గొన్నారు.