శేరిలింగంపల్లి, జూలై 17 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ కాలనీలో ఉన్న శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి దేవాలయంలో నిర్వహించిన కల్యాణ మహోత్సవం కార్యక్రమంలో కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలింగ్ గౌతమ్ గౌడ్, దాత్రి నాథ్ గౌడ్, మల్లేష్ గౌడ్, సంజయ్ గౌడ్, శ్రీనివాస్ కేశవ్, గోపాల్, అశోక్ తేజ, మహేష్, యాదగిరి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






