శేరిలింగంపల్లి, జూలై 15 (నమస్తే శేరిలింగంపల్లి): వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ కి చెందిన పూర్ణచందర్ వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా CMRF ద్వారా మంజూరైన రూ.14,000 ఆర్థిక సహాయానికి సంబంధించిన CMRF చెక్కును బాధిత కుటుంబానికి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాయి నేనీ చంద్రకాంత్ రావు, జిల్లా గణేష్, పురెందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






