నమస్తే శేరిలింగంపల్లి: లింగంపల్లి డివిజన్ లోని లింగంపల్లి విలెజ్, లింగంపల్లి మార్కెట్ లో శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..
ప్రజలకు సకాలంలో ప్రభుత్వ ఫలాలు అందాలంటే.. కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే మేనిఫెస్టోలో పొందు పరిచిన 6 గ్యారంటీల అమలుకు ప్రత్యేక కృషి జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకి ఓటు వేయాల్సిందిగా అభ్యర్ధించారు.