- హఫీజ్ పేట్ లో నిర్వహించిన ప్రచారంలో ఎమ్మెల్యే గాంధీ
- అపూర్వ స్వాగతం పలికిన ప్రజలు
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మళ్ళీ బిఆర్ఎస్ జెండా ఎగురవేసి సత్తా చూపిస్తామని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ హఫీజ్పెట్, సాయి నగర్, యూత్ కాలనీ , ప్రకాశ్ నగర్ కాలనీలలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ..
పేదల పక్షపాతి, రైతు బంధావుడు, మహిళల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా అని, అందరికి సన్న బియ్యం, ఆసరా పెన్షన్ల పెంపు, దివ్యాంగుల పెన్షన్ పెంపు, 400 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వడం మహిళలకు పెద్ద ఉపశమనమని, ఆరోగ్య శ్రీ గరిష్ట పరిమితి 15 లక్షల పెంపు చేయడం గొప్ప విషయం అని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే వచ్చే ఐదేండ్ల కాలంలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, శ్రేయోభిలాషులు, పాల్గొన్నారు.