నమస్తే శేరిలింగంపల్లి: కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో దక్కుతున్న ఆదరణ.. ప్రభుత్వం పై వ్యతిరేకత స్పష్టంగా కనపడుతుందని కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ గూటికి చేరిన మాజీ కౌన్సిలర్ సునీత ప్రభాకర్ రెడ్డికి కండువా కప్పి పార్టీ లో కి ఆహ్వానించారు.

ఈ సందర్బంగా సునీత ప్రభాకర్ మాట్లాడుతూ శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు
ఎవరు ఎన్ని రకాలుగా మభ్య పెట్టిన ప్రజలు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారని , రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు.