జ్ఞాపకశక్తి పెంపొందించేందుకు పుస్తక పఠనం దోహదం

  • ఆరంభ టౌన్షిప్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గ్రంథాలయం ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
  • దేవి నవరాత్రోవాల్లో భాగంగా దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి పూజలు.. భక్తులకు అన్నదానం

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ లోగల ఆరంభ టౌన్షిప్ లో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లైబ్రరీ ను ముఖ్య అతిధులుగా హాజరై రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు.  అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ తాను ఈ స్థాయిలో ఉన్నామంటే గ్రంథాలయాల వల్లే అన్నారు. గ్రంథాలయాల్లో పుస్తకాలు చదివి అనేక విషయాలు తెలుసుకున్నట్లు చెప్పారు. పుస్తక పఠనం చేయడం ద్వారా జ్ఞాపకశక్తి పెంపొందుతుందని తెలిపారు. విద్యార్థులు, నిరుద్యోగులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆరంభ టౌన్షిప్ ఆవరణలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఆరంభ టౌన్షిప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ విచ్చేసి దేవి దుర్గామాత ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అనంతరం ఆదర్శ్ నగర్ కాలనీలో దసరా నవరాత్రుల సందర్భంగా దుర్గామాత అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారి ఆశీర్వాదాలు అందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

ఈ సందర్బంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా వడ్డించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సోమదాస్, ఆరంభ టౌన్షిప్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీంద్ర రాథోడ్, మధుసూదన్ రెడ్డి, గోపాల్ యాదవ్, శివయ్య, వెంకట చారీ, బస్వలింగం, మహేష్, ప్రసాద్, భీమ్ రావు, స్వరూప రాణి, దీప, వీణ, వాణి, బాలమణి, విజయ, భిక్షపతి, రెహనా బేగం, నాగరాజు, జనార్ధన్, కుటుంబరావు, అరుణశ్రీ, దాసరి సరిత, మానస, పూజ, ఆరంభ టౌన్షిప్ వాసులు, పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here