నమస్తే శేరిలింగంపల్లి : గడపగడపకు బిజెపి రవన్న ప్రజా యాత్రలో భాగంగా 3 రోజులుగా లింగంపల్లి డివిజన్ పాపిరెడ్డి కాలనీలో పర్యటిస్తున్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాపిరెడ్డి కాలనీలో 2014కు ముందు చేసిన అభివృద్ధి తప్ప, బి.ఆర్.ఎస్ ప్రభుత్వం వచ్చాక కాలనీకి చేసింది శూన్యమని పేర్కొన్నారు. కాలనీలో ప్రజలకి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, పెన్షన్స్, రేషన్ కార్డ్స్, నిరుద్యోగ భృతి ఇలా ఎన్నో దొంగ హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారని విమర్శించారు.
మిమల్ని నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. ఈ పాదయాత్రలో మీ సమస్యలు విన్నాను, చూసాను, మీరు ఓటుతో ఆశీర్వదించండి, గెలిపించండి, అండగా ఉంటామని ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కంటెస్టెడ్ కార్పొరేటర్ ఎల్లేష్, రమేష్, అనిల్ కుమార్ యాదవ్, చంద్ర మోహన్, శ్రీనివాస్, బీరప్ప, శ్రీశైలం, గోపి ,భాస్కర్, నర్సింగ్ యాదవ్, రాజేష్ ,ఇమ్రాన్ , అఖిల్, హరీష్, విజయలక్ష్మి, కృష్ణవేణి, అరుణ, సుశీల, లక్ష్మి,జ్యోతి, మధు యాదవ్, గణేష్, భరత్, మొదలగు వారు పాల్గొన్నారు.