నమస్తే శేరిలింగంపల్లి : వేముకుంట, గౌతమినగర్, చందానగర్ లోని శ్రీ శ్రీ శ్రీ మహాశక్తి లలితా పోచమ్మ దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం అమ్మవారు సరస్వతీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన లలితా సహస్ర నామ సామూహిక కుంకుమార్చనలో 250 మంది మహిళలు పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
దాదాపు 800 మంది భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ప్రభుత్వ విప్ ఆరెపూడి గాంధీ సతీమణి, ఆమె కుటుంబ సమేతంగా అమ్మవారికి వస్త్రాలు సమర్పించి, అలంకరణ, అభిషేకం చేసి పూజలో పాల్గొన్నారు. చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, గౌతమినగర్ కాలనీ అధ్యక్షులు ప్రసాదరావు, సెక్రెటరీ శివప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ నారాయణ, గాంధీచౌదరి, జగదీష్, జగన్నాథరావు, జవహర్ కాలనీ సెక్రటరీ రామానాయుడు దేవాలయ అర్చకులు సాయి శర్మ, దేవాలయ ట్రస్టీ, గుఱ్ఱపు విజయలక్ష్మి, రవీందర్ రావు పాల్గొన్నారు.